22 June, 2026 | 1:42 AM

బేగంపేట నీట్ పరీక్షా కేంద్రం తనిఖీ

22-06-2026 12:44 AM

సికింద్రాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలో నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని  కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ఆదివారం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోనీ నీట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు.

పరీక్షా కేంద్రంలోని  భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్, వినియోగించని, మిగిలిన పరీక్షా సామగ్రి భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. 960 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, వింగ్‌ఏలో 720 మందిలో 70 మంది గైర్హాజరయ్యారని అలాగే  వింగ్‌బీలో 240 మందిలో 36 మంది గైర్హాజరయ్యారని వివరించారు.   జిల్లాలో  మొత్తం 27,954 మంది అభ్యర్థులకు 24,973 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు అయ్యారని తెలిపారు. 89.34 శాతం  అయినట్లు కలెక్టర్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మావతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంధ్య, సెంటర్ అబ్జర్వర్ డాక్టర్ కిషన్, నోడల్ అధికారి పాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.