27 August, 2026 | 11:14 AM

కంటి చూపును పరిరక్షించుకోవాలి: సమతుల్య ఆహారం, రెగ్యులర్ చెకప్ అవసరం

22-06-2026 12:45 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూన్ 21 (విజయక్రాంతి): వయసు పెరుగుతున్న కొద్ది చూపు మందగిస్తుంటుందనీ.. ప్రతిఒక్కరూ కంటి చూపును పరిరక్షించుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ వెంచర్-3 హిమకీర్తి అపార్ట్మెంటులో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే? ఈ 5 అలవాట్లు తప్పనిసరి.. వైద్యుల కీలక సూచనలు

అందులో కంటి పరీక్షలు చేయించుకున్న పలువురికి కళ్ళద్దాల పంపిణీ నిర్వహించారు.  కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే లబ్ధిదారులకు కళ్ళజోళ్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంటి పరిరక్షణ కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.   నిర్వాహకులను అభినందించారు.  కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు, సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వయసు పెరిగేకొద్దీ కంటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

FAQ's

Q1. కంటి చూపును ఎలా పరిరక్షించుకోవాలి?

సమతుల్య ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ కంటి పరీక్షలు చేయించుకోవడం, స్క్రీన్ టైమ్‌ను నియంత్రించడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Q2. ఎంత కాలానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి?

సాధారణంగా సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తారు.

Q3. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

చూపు మందగించడం, కంటి వ్యాధులు తీవ్రం కావడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Q4. కంటి ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది?

విటమిన్ A, C, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆకుకూరలు, క్యారెట్, చేపలు, పండ్లు తీసుకోవడం మంచిది.

Q5. వయసు పెరిగేకొద్దీ కంటి పరీక్షలు ఎందుకు అవసరం?

గ్లాకోమా, క్యాటరాక్ట్, మాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి కంటి పరీక్షలు అవసరం.