15 April, 2026 | 11:33 AM

గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

22-12-2025 06:28 PM

కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని కుప్టీ గ్రామంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సర్పంచ్ పోదుగంటి గంగారం, ఉప సర్పంచ్ చిన్ను గుండొల్ల (లక్ష్మన్), పంచాయతీ సెక్రటరీ సంజీవ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా భోజన నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పథకం సక్రమంగా అమలవుతుందని తెలిపారు.