రైల్వే బ్రిడ్జి పనుల పరిశీలన
ఘట్ కేసర్, జూలై 1 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే వంతెన పనుల పురోగతిని ఆర్ అండ్ బి అధికారులు బుధవారం పరిశీలించారు. రైల్వే వంతెన గురించి ఘట్ కేసర్ మున్సిప ల్ మాజీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగ య్య యాదవ్ విజ్ఞప్తి మేరకు ఆర్ అండ్ బి అధికారులు ఈఈ, డీఈ, ఏఈ విచ్చేసి రైల్వే వంతెన పనుల పురోగతిని పరిశీలించడం
జరిగింది. బ్రిడ్జి యొక్క పనులు రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈసంద ర్భంగా మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ మాట్లాడుతూ అనేక కారణాలతో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడంలో గత కాం ట్రాక్టర్ నిర్లక్ష్యం వహించినప్పటికీ మున్సిపల్ చైర్ పర్సన్‌గా బ్రిడ్జి పనుల పూర్తిపై దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు.






