calender_icon.png 3 August, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌టీపీ మరమ్మతు పనుల పరిశీలన

03-08-2025 12:03:57 AM

పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగస్టు 2: చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్, శాంతి నగర్ కాలనీల మధ్య గల ఎస్‌టిపి లైన్‌లో తలెత్తిన సమస్య పరిష్కారానికై  చేపడుతున్న మరమ్మతు పునరుద్ధరణ పనులను  జలమండలి  అధికారులతో  కలిసి ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే  గాంధీ  మాట్లాడుతూ  దీప్తి శ్రీ నగర్ , శాంతి నగర్ కాలనీల మధ్య గల  ఎస్‌టిపిలో తలెత్తిన సమస్య ను సూపర్ సక్కర్ యంత్రం ద్వారా  పనులు చేపడుతున్నాం అని,  లైన్‌లో పేరుకుపోయిన చెత్త చెదారంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.

త్వరి తగతిన పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని, డ్రైనేజి మ్యాన్ హోల్‌లను మరమ్మత్తులను చేపట్టి ఇబ్బంది లేకుండా చూడలని, మళ్లి పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, సూపర్ సక్కర్  మిషన్ ద్వారా ప్రతి మ్యాన్ హోల్ లో చెత్త చెదారం లేకుండా పూడిక తీసి, నీటి ప్రవా హం సాఫీగా సాగేల చూడలని, అవసరమున్న చోట మ్యాన్ హొల్స్ ను మరమ్మత్తులు చెపట్టి అందుబాటులోకి తీసుకోవాలని జలమండలి అధికారులకు పీఏసీ చైర్మన్ గాంధీ  తెలియచేసారు.  ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు  మేనేజర్  శిరీష, వర్క్ ఇన్స్పెక్టర్ కిష్టప్ప, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు  తదితరులు పాల్గొన్నారు.