03-08-2025 12:02:16 AM
చండూరు,(విజయక్రాంతి): గుండెకి సంబంధించిన హార్ట్ బీట్ తో బాధపడుతున్న చండూరు మండలం తుమ్మల పల్లి లో నిరుపేద కుటుంబానికి చెందిన జెర్రిపోతుల రమేష్ కు హార్ట్ బీట్ తక్కువ ఉండడంతో అత్యవసరంగా ఫేస్ మేకర్ అమర్చవలసిన అవసరం పడింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తులు రమేష్ పరిస్థితిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే హాస్పిటల్ కు అయ్యే లక్ష రూపాయలు అందజేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఆపదలో ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి రుణపడి ఉంటామని కుటుంబ సభ్యులు చేతులెత్తి నమస్కరించారు.