20-02-2026 12:07:24 AM
ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు
కాగజ్ నగర్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి):కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సహాయ కార్మిక శాఖ అధికారి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సహాయ కార్మిక శాఖ అధికారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంచి ర్యాల ఏసీబీ డీఎస్పీ మధు ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. కార్యాలయం లోని రికార్డులు, కంప్యూటర్లలోని డేటాను అధికారులు పరిశీలించి, అవసరమైన వివరాలను సేకరించారు. రాత్రి వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. పూర్తిస్థాయిలో సమాచారం సేకరించిన అనంత రం వివరాలను వెల్లడించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.