calender_icon.png 8 January, 2026 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందల్వాయి మండలంలో తనిఖీలు

07-01-2026 03:23:04 PM

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఎస్సై సందీప్ హెచ్చరిక

ఇందల్వాయి,(విజయక్రాంతి): ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రాణాంతకమైన చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఇందల్వాయి ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాలు, గోదాములలో, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చైనా మాంజా వల్ల పక్షులు, జంతువులు మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు పౌరులుకూడా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై సందీప్ మాట్లాడుతూ, చైనా మాంజా అమ్మకం లేదా వినియోగం చట్టరీత్యా నేరం అని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.