calender_icon.png 26 October, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో కొనసాగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ

26-10-2025 10:41:45 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రయివేట్‌ వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 289 బస్సులపై చర్యలు తీసుకున్న అధికారులు తిరుపతిలో 25 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఏలూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేసిన అధికారులు 67 బస్సులపై, తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేసి, నాలుగు బస్సులు సీజ్‌ చేశారు. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, నంద్యాలలో నాలుగు కేసులు నమోదు చేశారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేవని ఎనిమిది బస్సులు, అత్యవసర ద్వారం లేదని 13 బస్సులపై కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని 103 బస్సులపై, ప్యాసింజర్‌ లిస్టు లేని కారణంగా 34 బస్సులపై, ఇతర ఉల్లంఘనలపై 127 కేసులు నమోదు చేశారు.