calender_icon.png 26 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసిల్లలో మున్నూరు కాపు సభ్యత్వ నమోదు ప్రారంభం

26-10-2025 10:06:56 AM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంలో మున్నూరు కాపు పటేల్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షుడు వొజ్జల అగ్గి రాములు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, పట్టణంలోని ప్రతి మున్నూరు కాపు కుటుంబంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కల్లూరి చందన, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమురయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు మారం కుమార్, అలాగే పట్టణ, యూత్, రైతు విభాగాల నాయకులు, కాలనీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.