రోడ్లపై ప్రమాద సూచికల ఏర్పాటు
25-03-2026 01:14 AM
భీమదేవరపల్లి, మార్చి 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి, గట్ల నర్సింగాపూర్, రాం నగర్ గ్రామాల పరిధిలో రహదారులపై ప్ర మాదాలు జరగకుండా ముందస్తుగా ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినట్లు ముల్కనూర్ ఎస్త్స్ర రాజు తెలిపారు.
భీమదేవరపల్లి మండలంలో నిత్యం ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ వాహనదారులకు జాగ్రత్తలు కొరకు ముందస్తుగా ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్త్స్ర తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలను నడపకూడదని సూచించారు. వాహనదారులు ఎక్కువగా ప్రమాదం జరుగుతున్న చోట జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




