25 March, 2026 | 2:48 AM

ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

25-03-2026 01:14 AM

మానకొండూరు మార్చ్ 24 (విజయక్రాంతి)సిద్ధిపేట జిల్లా నర్మెట్ట సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నర్మెట్ట బహిరంగ సభలో  రైతు భరోసా కింద తొలి విడుతగా ఎకరం వరకు వ్యవసాయ భూములు కలిగి ఉన్న 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,600 కోట్లు డబ్బు జమకానుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు.

దీంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ,

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కంటోన్మెంట్ శాసనసభ్యులు  గణేష్ ప్రభృతులు మంగళవారం మర్యాదపూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు.రైతు భరోసా నిధుల విడుదలపై ఉగాది పర్వదినాన తీపి కబురు అందించిన ప్రభుత్వం నర్మెట్ట సభలో వాటికి మీటనొక్కి విడుదల చేయడం ద్వారా మాటనిలుపుకున్నారంటూ రేవంత్ రెడ్డిని అభినందలతో ముంచెత్తారు.