calender_icon.png 3 December, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని వివాహిత బలవన్మరణం

03-12-2025 10:48:04 PM

చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలం, ఏపూర్ గ్రామానికి చెందిన మందుల లక్ష్మమ్మ(40) వివాహిత కడుపునొప్పి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఏపూర్ గ్రామానికి చెందిన మందుల నరసింహ భార్య అయిన లక్ష్మమ్మ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వైద్యులచే చికిత్స తీసుకుంటుంది. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.