calender_icon.png 28 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డిలో అంత‌ర్ జిల్లా బాస్కెట్ బాల్ టోర్న‌మెంట్

28-11-2025 11:10:22 PM

* ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మ‌న్ నిర్మ‌ల జ‌గ్గారెడ్డి

* హాజ‌రైన మెద‌క్ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు

సంగారెడ్డి,(విజ‌య‌క్రాంతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్ర‌వారం నాడు అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ను తెలంగాణ పరిశ్రమల మౌళిక సదుపాయాల చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఖచ్చితంగా అవసరమ‌ని,  పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

క్రీడల అభివృద్ధి కోసం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు రూ.10 కోట్లు మంజూరు చేశారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రం నుండి అంతర్జాతీయ బాస్కెట్ బాల్ క్రీడలు ఆడి స్వర్ణ పథకం సాధించిన అమ్మయిలను సత్కరించారు. ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ క్రీడల ద్వారా గౌరవం, కీర్తి లభిస్తాయని, తల్లితండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు. తన ఎంపీ నిధులనుండి పది రోజులలో లైటింగ్, ఇంకో కొత్త బాస్కెట్ బాల్ కోర్ట్ కు నిధులు ఇస్తానని తెలిపారు.