28-11-2025 11:00:31 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాసోజు శంకరా చారి శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, పార్టీ శ్రేణులు తరలిరాగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి బండ మధుసూదన్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందించారు. అంతకుముందు కాషాయజెండా రెపరెపలు, జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాల మధ్య భారీ జనసమూహంతో భారీ ర్యాలీ నిర్వహించారు.
శాంభవీ మాత, శివాలయం, కాటమయ్య, రామాలయం చేరుకుని ఆ దేవాదిదేవతల ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంజి గోవర్ధన్, చెరుపల్లి వేణు, మిర్యాల గోపాలకృష్ణ, కంభంపాటి వెంకన్న, డాక్టర్ చెరుపల్లి శ్రీనివాసులు, గ్రామశాఖ అధ్యక్షుడు వరికుప్పల నరసింహ, ఉపాధ్యక్షులు ఐతరాజు రమేశ్, వీరమళ్ల శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, ప్రిన్స్ రమేశ్, శ్రీరామోజు నరేశ్, వంశీ, మల్లేశ్, మిర్యాల వేణు, కర్నాటి వెంకటేశ్, సందీప్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమ అభ్యర్థి విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.