28-11-2025 11:07:53 PM
- మన్సూరాబాద్ డివిజన్ వైద్యుడికి ఉన్నత పదవి
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీకాలనీలో ఉన్న ప్రసిద్ది హాస్పిటల్ ఎండీ జుకూరి చైతన్య రాజు వర్మకు ఉన్నతస్థానం లభించింది. టీ పీసీసీ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్గనైజెషన్ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రాజీవ్ ఉత్తర్వులు అందజేశారు.
గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.రాజీవ్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ చేతులు మీదుగా జుకూరి చైతన్య రాజు వర్మ నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను శక్తివంతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడానికి చైతన్య రాజు వర్మ సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.
చైతన్య రాజు వర్మ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, ప్రతి ఇంటికి ఆరోగ్య అవగాహన చేరవేయడం తన ముఖ్య ధ్యేయమని తెలిపారు. వైద్య శిబిరాలు, ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజా సేవలకు తాను నిరంతరం కృషి చేస్తాన్నారు.