calender_icon.png 28 November, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరాలపై ఎస్వోటీ పోలీసుల దాడులు.. ఐదుగురు అరెస్ట్

28-11-2025 11:21:41 PM

ఉప్పల్,(విజయక్రాంతి):  పేకాట సావరంపై దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పల్  బాగాయత్ ఎమ్మెన్నార్ అపార్ట్మెంట్స్ నందు  ఉన్న జెకెఆర్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో  నిత్యం పేకాడుతున్నారు సమాచారం మేరకు  ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. 

ఈ దాడిలో పేకాడుతున్న  జక్క కరుణాకర్ రెడ్డి  సోలిపురం చిన్నారెడ్డి పోతరాజు శ్రీనివాసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి  12800 నగదు మరియు  చరవాని పేకాట కార్డ్స్  స్వాధీనం చేసుకున్న పోలీసులు  ఉప్పల్ పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసి పోలీసు దర్యాప్తు చేస్తున్నారు.             

అర్ధరాత్రి టిఫిన్ సెంటర్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా  మారిన ఉప్పల్

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఉప్పల్ బాగాయత్ ఉప్పల్ మెట్రో  ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ వద్ద  అర్ధరాత్రి టిఫిన్ సెంటర్ లు తాగుబోతుల కు అడ్డగా మారాయని పలువురు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి టిఫిన్ సెంటర్ వద్ద  కారులో మద్యం సేవిస్తూ  రోడ్డుపై వెళ్లే వారిని ఇబ్బంది గురి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

జూదం మద్యం అర్ధరాత్రి  కేరాఫ్ అన్నట్టు ఉప్పల్ ఉందని  పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి డ్యూటీ ముగించుకొని  ఇంటికెళ్లేవారు  టిఫిన్ సెంటర్ దగ్గర ఆగే పరిస్థితి లేదని  రోడ్లపై పెట్టే టిఫిన్ సెంటర్లో బార్లుగా మారాయని  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి రోడ్డుపై అర్ధరాత్రి అమ్మేటిఫీన్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు