calender_icon.png 28 November, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య

28-11-2025 11:05:01 PM

- చైతన్యపురి, ఎల్బీనగర్ డివిజన్లలో విషాదం 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో శుక్రవారం వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు విద్యార్ధినులు ఆత్మహత్య చేసుకున్నారు. చైతన్యపురి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఇంట్లో వారి ఒత్తిడి భరించలేక ఒకరు, ఫ్యాకల్టీ ఒత్తిడి భరించలేక మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, ఐ సారీ మమ్మి, డాడి, చెల్లి.. నా వల్ల అవడం లేదని సూసైడ్ లెటర్ రాసి బీటెక్ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

మాన్సురాబాద్ డివిజన్ బాలాజీనగర్ లో నివాసం  ఇంటి సుధాకర్, జ్యోతి భార్యభర్తలు, జ్యోతి కామినేని హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేసుంది. సుధాకర్ వనస్థలిపురంలోని ఒక చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె దివ్య(20) కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. అక్కడే హాస్టల్ లో ఉంటుంది. ఈ నెల 26న మధ్యాహ్నం 2 గంటలకు దివ్య ఇంటికి వచ్చి తనకు కాళ్ల నొప్పి ఉందని తల్లికి చెప్పింది.  గురువారం సాయంత్రం 4 గంటలకు దివ్య ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.

ఈ మేరకు దివ్య తల్లి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బెడ్ రూమ్ పరిశీలించగా, సూసైడ్ లెటర్ దొరికింది. ఈ లెటర్ లో తన మరణానికి ఎవరూ భాధ్యులు కారని ఐ యాం సారీ.. డాడీ, మమ్మీ, చెల్లి.. అని రాసింది.  జేఎన్టీయూ కళాశాల ఫ్యాకల్టీ పెట్టిన ఇబ్బందులు, వేధింపులతోను దివ్య ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. 

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో...

కొత్తపేట డివిజన్ మార్గదర్శి కాలనీలో  వి.మహేశ్వరి(17) ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎలాంటి పని చేయడం లేదని తల్లిదండ్రులు మందలించిన కారణంగా మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తు న్నారు‌. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.