calender_icon.png 28 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్టు షాపుపై పోలీసులు దాడి: ఎస్సై మహేష్

28-11-2025 10:48:48 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలోని బెల్టు షాప్ పై శుక్రవారం సిర్గాపూర్ పోలీసులు రైడ్ చేశారు. మొత్తం 12.0 లీటర్ల విస్కీ, 12 బీర్ బాటిల్, 18 ఓసి, 8 ఐబీలను స్వాధీనం చేసుకుని బెల్టు షాప్ నిర్వహికుడు బసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్సై మహేష్ మాట్లాడుతూ... నమ్మదగిన సమాచారం మేరకు బసిరెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి అక్రమంగా బెల్ట్ షాప్ నడిపిస్తున్నడన్న సమాచారం మేరకు రైడ్ చేసి బీర్ బాటిల్లు, విస్కీ బాటిల్లు మొత్తం12 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన, పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సిర్గాపూర్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్సై మహేష్ అన్నారు.