22-04-2025 12:56:46 AM
ఖమ్మం, ఏప్రిల్ 21( విజయక్రాంతి ):-ద్విచక్ర వాహనాలను దొంగిలించి విక్రయించే అంతర్ జిల్లా దొంగలను ఖమ్మం జిల్లా విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దమ్మపేటకు చెందిన మక్కెళ్ళ నాగ రాజు, సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన చల్లా శివ ప్రసాద్ అనే ఇద్దరు బైక్ దొంగలను విఎం బంజర్ ఎస్ ఐ కె. వెంకటేష్ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు ఏసీపీ రఘు సోమవారం వియం బంజర్ పోలీస్ స్టేషన్ లో సీఐ ముత్తిలింగం, ఎస్ ఐ కే వెంకటేష్ లతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వె ల్ల డించారు .
వియం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో 7, సత్తుపల్లిలో 3, వేంసూరులో 3, ఏలూరు జిల్లా పెద్ద వేగి లో 1, అశ్వరావుపేట, జంగారెడ్డి గూడెం ఏరియాలో 4 మొ త్తంగా 18 మోటార్ సైకిల్ లను ఈ ఇద్దరు నిందితులు చోరీ చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయించగా వివరించారు. వాటిని రికవరీ చేశా మన్నారు. వాహనాల రికవరీలో చురుకైన పాత్ర పోషించిన పోలీసు సిబ్బంది రాజమల్లు, సురేష్, బాలకృష్ణ, బి. వెంకటేశ్వ రావు, శ్రీనివాసరావు, మజీద్ పాషా, వెంకటేశ్వరరావు లకు ఏసీపీ రఘు రివార్డులను అందజేశారు.