13-05-2025 10:50:10 PM
బోథ్ (విజయక్రాంతి): భార్య మరణంతో ఒంటరితనంతో కృంగిపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బోథ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్(SI Praveen Kumar) తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని రెండ్లపల్లి గ్రామానికి చెందిన మెస్రం వెంకటేశ్వర్ భార్య గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటి నుండి భార్యలేదని మనోవేదన చెందుతూ ఒంటరిగా ఫీల్ అయ్యేవాడు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఏకాంతంగా గడిపేవాడు. చివరకు జీవితంపై విరక్తి చెంది మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తండ్రి మెస్రం సుదర్శన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.