13-05-2025 10:45:05 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్‌లో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, డాక్టర్ చైతన్య, డిప్యూటీ డెమో మొహమ్మద్ ఫైజ్మోహియుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్‌లతో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సమయంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఆసుపత్రి, డయాగ్నస్టిక్ సెంటర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అవి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కింద నమోదు చేస్తామని హెచ్చరించారు.
నిబంధనలు పాటించడంలో విఫలమైతే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ సెంటర్‌లు, ఆయుష్ ఆసుపత్రులతో సహా అన్ని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చట్టబద్ధంగా కార్యకలాపాలను కొనసాగించడానికి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం కింద నమోదును నిర్ధారించుకోవాలని డిప్యూటీ డెమో మొహమ్మద్ ఫైజ్మోహియుద్దీన్ పునరుద్ఘాటించారు.