13-05-2025 11:00:42 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): రైతులు ఒకే రకమైన పంటలు పండించకుండా ప్రత్యామ్నాయ పంటలు వాణిజ్య పంటలు సాగు చేయాలని, ఆయిల్ ఫామ్ పంట సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్(ADA Babu Naik) అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగు, రైతులకు రైతు గుర్తింపు కార్డుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకొని ధాన్యం కొనుగోలు సక్రమంగా నిర్వహించాలన్నారు.
రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ధాన్యం విక్రయించాలన్నారు. రైతులకు రైతు గుర్తింపు కార్డు కోసం భూమి ఉన్న ప్రతి రైతు ఆధార్ కార్డు జీరాక్స్, పట్టా పాస్ బుక్ జీరాక్స్, ఆధార్ నెంబర్ కి లింక్ ఉన్న మొబైల్ తో వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి రైతు గుర్తింపు కార్డుల కోసం నమోదు చేసుకొని రైతు గుర్తింపు కార్డు పొందాలన్నారు. రైతు గుర్తింపు కార్డుల ద్వారా కేంద్ర ప్రభుత్వ పతకాలు పీఎం కిసాన్ వంటివి పథకాలు అమలు చేయడానికి తోడ్పడతాయన్నారు.
కావున ప్రతి రైతు వారి క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ బెడద, వడగళ్ల వర్షం బెడద ఉండదు. వరితో పోలిస్తే ఆయిల్ పామ్ పంటపై వచ్చే ఆదాయం కూడా ఎక్కువ అని, ఆయిల్ పామ్ పంటపై వున్న సబ్సిడీల గురించి కూడా రైతులకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓ స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు.