calender_icon.png 14 May, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రతల అరెస్ట్

13-05-2025 11:10:49 PM

బైంసా (విజయక్రాంతి): బైంసాలో గంజాయి విక్రయిస్తుండగా ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్(ASP Avinash Kumar) తెలిపారు. పట్టణంలోని నిర్మల్ జాతీయ రహదారి పక్కన హెచ్ పి పెట్రోల్ పంపు సమీపంలో మధ్యాహ్నం సుమారు 12 గం.ల ప్రాంతములో సీఐ గోపీనాథ్ ఆధ్వర్యంలో ఎస్సై గణేష్, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రైడ్ లో భాగంగా మంగళవారం నిషేదిత గంజాయి అమ్ముతున్న ముజాహిద్ ఖాన్ @ సుల్తాన్ @ ఇంతియాజ్, షేక్ అహ్మెద్ ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వాహనాలను చూసి వారు పారిపోతుండగా పోలీస్ వారు అతన్ని వెంబడించి పట్టుకొని వారి వద్ద నుండి సుమారు 1.5 కేజీల ఎండు గంజాయిని స్వాధీనపరచుకోవడమైనది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు అధికారులు చూపిన చరవను ఆయన అభినందించారు