13-05-2025 10:41:48 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మోరంపల్లి బంజర పంచాయతీ పరిధిలోని మర్రికుంట గ్రామంలో చోటుచేసుకుంది. బూర్గంపాడు మండల పరిధిలోని ఉప్పుసాక గ్రామానికి చెందిన వర్ష శివ, సోడే నరసింహారావులు ద్విచక్ర వాహనం (పల్సర్) పై లక్ష్మీపురం గ్రామంలోని బేకరీ షాపులోంచి కేక్ ను కొనుగోలు చేసుకుని తిరిగి ఉప్పుసాక వచ్చే క్రమంలో మర్రికుంట గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టాక్ చేస్తూ ఎదురుగా వచ్చే కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులకి కాళ్లు చేతులు విరిగి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు కూడా వెళ్లిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.