13-05-2025 10:37:56 PM
మాజీ మంత్రి జోగు రామన్న..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): నవదుర్గా మాత ఆలయ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దుర్గ గర్ లోని శ్రీ నవశక్తి మత ఆలయంలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ కిషన్ మహరాజ్ నేతృత్వంలో నవశక్తి మత పీఠాన్ని ఊరేగిస్తూ, అమ్మవారి కొలువుదీరిన సందర్భంగా భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. మాజీ మంత్రి జోగు రామన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని సల్గిస్తోందని మాజీ మంత్రి రామన్న పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తూ పాడి పంటలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి కిషన్ మహారాజ్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. దిన దిన అభివృద్ధి చెందుతుందన్నారు.