calender_icon.png 14 May, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

13-05-2025 10:54:40 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరిరోజైనా మంగళవారం ఉదయం సేవా కాలం మూలమంత్ర హవనం, మహా పూర్ణాహుతి, బలిహరణ, మహా కుంభ ప్రోక్షణ, చక్రతీర్థోత్సవం, మధ్యాహ్నం శ్రీ పుష్పయాగం, దేవతో ద్వాసనం, ద్వాదశరాధన, సప్తావరణం, ధ్వజావరోహణం, రుత్విక్ సన్మానం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం మేళతాళాలతో స్వామివారిని ఊరేగింపుగా గ్రామ దేవాలయమునకు రథంలో తీసుకువెళ్లడం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో శ్రీధర్ రావు, వేద పండితులు, ఆలయ అర్చకులు, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.