నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిర్మల్, ఫిబ్రవరి ౨౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 13125 మంది పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరంలో 66 52 ద్వితీయ సంవత్సరంలో 6473 మంది పరీక్ష రాసేలా మొత్తం 23 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు.
ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష జరుగుతుందని జిల్లాలో పరీక్ష కేంద్రాల సీసీ కెమెరాల పరిరక్షణలో ఉంటాయని జిల్లా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పురుషోత్తం నాయక్ తెలిపారు. ఇప్పటికి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని హాల్ టికెట్ల విషయంలో ఎవరైనా ఇబ్బంది గురి చేస్తే వెంటనే తమ సంప్రదించాలని సూచించారు.
అలాగే ఇంటర్, 10 పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠినంగా చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించి ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.




