ఇంటర్ సప్లిమెంటరీ రీషెడ్యూల్
28-04-2024 01:57 AM
l మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎ న్నిక నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు రీషెడ్యూల్ చేసింది. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు శనివారం తెలిపింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మే 24వ తేదీ నుండి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే, మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఉన్న కారణంగా ఈ మార్పులు చేసింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఒకే రోజున నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థలకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.






