అంతర్జాతీయ చెస్ దినోత్సవ వేడుకలు
20-07-2024 05:48 PM
కరీంనగర్: ప్రపంచంలో చెస్ క్రీడకు ప్రత్యేమైన స్థానం ఉన్నదని ఈ క్రీడను ఆడడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని పాఠశాల నిర్వాహకులు నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి చెస్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడల పట్ల యువత చాలా శ్రద్ధ వహిస్తున్నదని చెస్ లో నైపుణ్యం పొందడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలలో భాగంగా 6,7వ తరగతి విద్యార్థులకు స్నేహపూర్వకంగా నిర్వహించి ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులతో పాటు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలను తెలిపారు.






