22 June, 2026 | 1:37 AM

‘నమో డ్రోన్ దీదీ’ అమలుకు నోడల్ కమిటీ

21-07-2024 12:02 AM

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): నమో డ్రోన్ దీదీ  పథకం రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు, నిర్వహణ కోసం రాజ్యాంగబద్ధమైన నోడల్ కమిటీని ఏర్పాటు చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ౯ మందితో కమిటీ ఉంటుందని పేర్కొంది. ఇందులో ఒకరు కన్వీనర్ కాగా.. ౮మంది సభ్యులు. అగ్రికల్చర్ డైరెక్టర్ కన్వీనర్‌గా, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్, గ్రామీణాభివృద్ధి కమిషనర్, సెర్ప్ సీఈఓ, కోఆపరేషన్ విభాగం డైరెక్టర్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేజనర్, కేఆర్‌ఐబీహెచ్‌సీఓ మేనేజర్, పీజేటీజీ అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్, డీఏఅండ్ ఎఫ్‌డబ్ల్యూ, డీఓఆర్‌డీ, డీఓఎఫ్ నుంచి సభ్యులు ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులో వెల్లడించింది. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. డ్రోన్ల ద్వారా పంటలకు పిచికారీ చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు మహిళా రైతులకు డ్రోన్లను పంపిణీ చేశారు. 2025 నుంచి పూర్తిస్థాయిలో  అమలు చేయనున్నారు.