10-12-2025 02:31:03 AM
దివ్యాంగులను ప్రోత్సహించిన చందానగర్ సర్కిల్- 21 డీసీ
చందానగర్, డిసెంబర్ 9: జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ 21 ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు సోమవారం అంబేద్కర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ కమిషనర్ శశిరేఖ మాట్లాడుతూ అంగవైకల్యం అనేది శరీరానికే పరిమితమని, మనసు బలంగా ఉంటే ఎలాంటి అడ్డంకి ఆపలేదని స్పష్టంగా చెప్పారు.
దివ్యాంగులు తమపై తాము నమ్మకం పెంచుకొని ముందుకు సాగాలని, మున్సిపల్ వ్యవస్థ నుంచి అండచేతి ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం దివ్యాంగులకు దుప్పట్లు, చంకకర్రలు, వీల్చైర్లు, చేతికర్రలు, హెరింగ్ మిషన్లు తదితర సహాయక పరికరాలు అందజేసి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, సిఓలు లక్ష్మి, లక్ష్మీగౌడ్, రుక్మిణి, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు విజయ్కుమార్, జనరల్ సెక్రటరీ ఫకీర్సాబ్, సలహాదారులు వైవి రమణ, నాగులు, అంజలి, దివ్య తదితరులు పాల్గొన్నారు.