calender_icon.png 15 December, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం

10-12-2025 02:32:19 AM

స్టాలిన్‌నగర్ దేవాలయంలో భక్తుల సందడి అన్నదానంలో రద్దీ

శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మియాపూర్ డివిజన్ స్టాలిన్నగర్ కాలనీలోని శ్రీ ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయంలో మంగళవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం భక్తుల రాకతో సందడిగా సాగింది. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి దేవాలయ ప్రాంగణం నిండిపోయింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.

కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి అన్నదానంలో పాల్గొని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడం ఆనందకరమని, అమ్మవారి దీవెనలు ప్రజలందరికీ కలగాలని గాంధీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.