05-01-2026 12:00:00 AM
పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
బిచ్కుంద, జనవరి 4 (విజయక్రాంతి): బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప ఫంక్షన్ హాల్లో ఆదివారం జుక్కల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.సర్పంచ్ లు అందరూ తమ విధులు పట్ల అవగాహన కలిగి ఉండాలని, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు పరస్పర సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.
సర్పంచ్ ల విధి నిర్వహణలో వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని, అదేవిధంగా మహిళా సర్పంచ్ ల స్థానంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా, మహిళా సర్పంచ్ లు ముందుండి వారి యొక్క విధులు నిర్వహించాలని చెప్పారు. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలను సాధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , అన్ని మండలాల అధ్యక్షులు, ఏఎంసి చైర్మన్ లు,పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్స్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.