30-07-2025 10:45:54 PM
గత ప్రభుత్వం మహిళా సంఘాలను నిర్వీర్యం చేసింది..
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
ఇందిరా మహిళా శక్తి పతాకంలో భాగంగా నిమ్మపల్లి గ్రామంలో ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
కోనరావుపేట (విజయక్రాంతి): ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆత్మవిశ్వాసానికి ఒక ప్రేరణ అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(State Government Whip Aadi Srinivas) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళలకు అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా విజయ భారతీ గ్రామైక్య వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల & విత్తనాల దుకాణానాన్ని అధికారులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకుపోతున్నారని తెలిపారు.
అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.అనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లిలకు పేద్ధపీఠ వేయడం జరుగుతుందని తెలిపారు..గతంలో వైఎస్ ర్ పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించాలని తెలిపారు.. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 20వేల పైచిలుక కోట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం మహిళా సంఘంలను ఏ మాత్రం పట్టించుకోలేదని చివరికి మూడు సంవత్సరాల వడ్డీని ఎగ్గొట్టినట్లు తెలిపారు.
మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని తెలిపారు.గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డి లేని రుణాలను ప్రజా ప్రభుత్వంలో పునరుద్దరించామని అన్నారు.గతంలో 15 మంది మహిళలతో మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొనేవారని అప్పుడు సంఘాలకు 10 వెల రూపాయలు లోన్ గ ఇచ్చే వారని అన్నారు. అనాడు మహిళ సంగంలో ఎవరైనా చనిపోతే ఆర్థిక సహాయం అందించే వారని కానీ గత పది సంవత్సరాలలో మహిళ సంగాలను నిర్వీర్యం చేశారని అన్నారు. 2024, 25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు లింకేజీ ద్వారా 84 కోట్లు, 2025-26 సంవత్సరానికి 58 కోట్లు బ్యాంకు లింకేజీ అందజేయడం జరిగిందని తెలిపారు.
4350 సంఘాలకు 5 కోట్ల 72 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, తహసిల్దార్ వరలక్ష్మి,ఎంపీడీవో శంకర్ రెడ్డి, ఏపిఎం రాకేష్, మండల వ్యవసాయ అధికారి సందీప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు అజీమ్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపూరి గంగాధర్, సత్యం, శ్రీనివాస్, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.