16-11-2025 12:58:39 AM
బోధనేతర పనులతోటీచర్లు సతమతం
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన సరిగా అందడం లేదు. కొందరు విద్యాశాఖ ఉన్నతాధి కారులు తీసుకునే నిర్ణయాలు, పైస్థాయి ఉన్నతాధికారుల మెప్పు కోసం చేసే పనులతో ఉపాధ్యాయుల బోధనా సమ యాన్ని వృథా చేస్తున్నారనే విమర్శలు ఉపాధ్యాయ వర్గం నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయి.
బోధన నుంచి పక్కకు తప్పించి, క్లరికల్ పనులకు వాడుతున్నారనే విమర్శలు న్నాయి. రకరకాల రిపోర్టులు, నివేదికలు, సమాచారం సేకరణ, మీటింగ్‌లు, రోజూవారీ బోధనేతర పనులతో బోధ నా సమయం సుజాతకు ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సంతోషించింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించి ఉత్తమ విద్యార్థుల్లాగా తయారు చేయాలని భావించింది. విధుల్లో చేరిన తర్వాత కానీ, ఆమెకు అసలు విషయం బోధపడలేదు.
విద్యా బోధన కంటే.. ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ అటెన్‌డెన్స్), మధ్యాహ్న భోజనం బాధ్యతలు, మీటింగ్‌లు, రిపోర్టు, ఎఫ్‌ఎల్‌ఎన్, మార్కుల అప్‌లోడిండ్, పుస్తకాలు, నోటుబుక్స్, వర్క్ బుక్స్, యూడైస్‌లో వివరాలు నమోదు, స్కూల్ ప్రాంగణం ఊడ్చా రాలేదా? టాయిలెట్స్ శుభ్రంగా క్లీన్ చేసారా? లైబ్రరీ రికార్డులు చెక్ చేయడం లాంటి బోధనేతర పనుల బాధ్యతలే ఎక్కువవడంతో ఆమె నిరుత్సాహపడింది.
ఉపాధ్యాయ వృత్తి అంటే ఏదో అనుకుని వస్తే... బోధన తప్ప బోధనేతర పనులే ఎక్కువగా ఉన్నాయి అని నిట్టూర్చింది. ఇది ఈ ఒక్క ఉపాధ్యాయురాలి పరిస్థితే కాదు. రాష్ట్రంలోని వేలాది మంది ఉపాధ్యాయుల పరిస్థితి. వీటికి తోడూ ఎన్నికలు విధులు, జనాభా లెక్కలు, కులగణన, కుటుంబ సర్వే లాంటివి ఉపాధ్యా యులపై అదనపు భారం పడుతున్నది.
విద్యాసంవత్సరం మొదల వగానే బడిబాట కార్యక్రమాన్ని చేపడుతూ విద్యార్థుల ఎన్‌రోల్ మెంట్‌ను పెంచేందుకు ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం గడిపి సర్కారు బడుల్లో చేరే ఆ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠాలు బోధించే పరి స్థితి లేకుంటే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తినేస్తున్నారు. రిపోర్టులు పంపాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు రావడం... వాటిని వాటిని పూర్తి చేసేందుకు తలపట్టుకోవడం ఉపాధ్యాయుల వంతవుతున్నది. బోధన తక్కువ.. పనులెక్కువ, అనే భావన ఉపాధ్యాయుల్లో ఉంది. సిబ్బంది తక్కువ ఉన్న పాఠశాలల్లోనైతే బోధనపై టీచర్లు సీరియస్‌గా దృష్టి సారించలేని పరిస్థితి తలెత్తుతున్నది.
వారంలో ఒక రోజు..
ఉపాధ్యాయులు తరగతి గదిలో ఎక్కువసేపు ఉండేలాగా అవకాశం కల్పించాలి. ఇలా విద్యాబోధనలో మార్పులు తీసుకురాగలిగితే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య తప్పకుండా అందుతుంది. వారంలో ఐదు రోజులను పూర్తిగా బోధనకు మాత్ర మే కేటాయించాలి. ఆరవ రోజు బోధనేతర పనులను పూర్తి చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. పీ రాజభాను చంద్రప్రకాష్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
మాతో ఎందుకీ పనులు?
టీచర్ సమయానికి పాఠశాలకు రావాలి. పిల్లలకు పాఠాలు చెప్పాలి. కానీ పాఠాలు చెప్పడం కంటే ఇతరత్రా పనులు చేయడమే ఎక్కువ అని ఉపాధ్యాయు లు అంటున్నారు. ఉదయం బడి మొదలైనప్పటి నుంచి సాయంత్రం వరకు ఏదోక రోజు రిపోర్టులు, నివేదికలు చెప్పినప్పుడల్లా సిద్ధం చేస్తూనే ఉండాలి. ఆన్‌లైన్ రిపోర్టులు, ఎఫ్‌ఎల్‌ఎన్, మార్కుల అప్‌లోడింగ్ చేయడం, జూమ్ మీటింగ్, కాంప్లెక్స్ సమావే శాలు, అప్పుడప్పుడు జిల్లా కలెక్టర్ల మీటింగ్‌లలో పాల్గొనడం లాంటివి చేయాల్సి ఉంటుంది.
ఆఖరికి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం కూడా ద్విచక్రవాహనంపై వెళ్లి కొన్ని చోట్ల ఉపాధ్యాయులే తెచ్చుకోవాల్సి వస్తోందని ఓ ప్రైమరీ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ పనులు మాకు చెప్పడమేంటి?.. పాఠాలు చెప్పాలా? లేకుంటే ఈ పనులే చేయాలా? అని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు వీటి గురించి పైఅధికారులకు చెప్పే ధైర్యమూ వారు చేయడంలేదు. ఒకవేళ చెబితే ఏమంటారోననే భయం వారికి వెంటాడుతోంది.
దీంతో ఏం చేయలేక ఉపాధ్యాయ సంఘాల నేతలు, తోటి ఉపాధ్యాయులు, వాట్సాప్ గ్రూపుల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటూ అసహనం వ్య క్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఇన్నేసి పనులు చేసి నా.. ఒకవేళ తేడా వస్తే మాత్రం వారిపై సస్పెన్షన్ వేటే. ఇక మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ బాధ్యతలం టే చాలూ ఉపాధ్యాయులు జంకుతున్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పెట్టకున్నా, ఒకవేళ వికటించినా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడుతోం ది.
టీచర్లకు పర్యవేక్షణ బాధ్యతలనూ అప్పగిస్తున్నారు. ఇందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల నుంచి జిల్లాల్లో దరఖాస్తులు స్వీకరించారు. ఇన్‌స్పెక్షన్ టీమ్‌లో నోడల్ అధికారులు, మెంబర్లుగా బాధ్యతలను అప్పగిస్తారు. వీరు పాఠశాలలను పర్యవేక్షణ చేస్తే మరీ బోధన పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.