16-11-2025 12:55:24 AM
పోలీసులకు చిక్కిన ఇమ్మడి రవి
-కరేబియన్ దీవుల నుంచి వచ్చి కూకట్‌పల్లికి..
-‘దమ్ముంటే పట్టుకోండి..’ అంటూ గతంలో పోలీసులకే సవాల్
-రూ. 20 వేల కోట్ల వరకు పైరసీ సామ్రాజ్యం.. రూ. 3 కోట్లు ఫ్రీజ్
భార్య రివెంజ్..?
రవి అరెస్ట్ వెనుక అతని భార్యే ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. భార్య తో విడిపోయి ఒంటరిగా ఉంటున్న రవి, విడాకుల కేసుకు సంబంధించి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకే భార్యే పోలీసులకు సమా చారం ఇచ్చి పట్టించిందని చెబుతున్నారు. పెళ్లానికి చుక్కలు చూపిద్దా మనుకుంటే.. రివర్స్‌లో ఐబొమ్మ ప డిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 15 (విజయక్రాంతి) : తెలుగు సినిమా పరిశ్రమకు, ఓటీటీ సంస్థలకు కొన్ని సంవత్సరా లుగా కంటిమీద కునుకు లేకుండాచేస్తున్న పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ కథకు పోలీసులు చరమగీతం పాడారు.
‘దమ్ముంటే పట్టుకోండి’ అంటూ పోలీసులకే సవాల్ విసిరిన ఈ పైరసీ సామ్రాజ్యపు సూత్రధారి ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రాజును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం ఉద యం కూకట్‌పల్లిలో పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కొన్ని సంవత్సరాలుగా కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ కేంద్రంగా ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కం టెంట్‌ను, థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను పైరసీ చేస్తూ తన సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చాడు.
తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు, అప్పటినుంచి రవి కోసం గాలిస్తున్నారు. ఫ్రాన్స్ నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన రవి, కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం..
రవి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 3 కోట్ల ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. పైరసీ ద్వారా తక్కువకాలంలోనే అతడు వందల కోట్లు సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అతని పైరసీ వల్ల 5 సంవత్సరాలు గా సినిమా పరిశ్రమకు సుమారు రూ. 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. రవి బస చేసిన అపార్ట్‌మెంట్‌లో జరిపిన సోదాల్లో పలు సినిమా లకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, హెచ్‌డీ ప్రింట్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
అప్‌లోడ్ చేయడానికి సిద్ధం గా ఉన్న కొన్ని కొత్త సినిమాలను కూడా గుర్తించారు. ఈ కేసులో రవి ఒక్కడే ఉన్నా డా లేక అతని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో రెం డు రోజుల విచారణ అనంతరం పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని, వెబ్‌సైట్ ను త్వరలోనే పూర్తిగా మూసివేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. రవిని న్యాయమూర్తి ముందు హాజరుపరుచగా ౧౪ రోజులు రిమాండ్ విధించారు. అనంతరం రవిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.