calender_icon.png 16 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానున్నది ఎన్నికల పర్వం

16-11-2025 01:02:21 AM

అధికార కాంగ్రెస్‌లో ‘జూబ్లీ’ జోష్ 

- దశలవారీగా ఎన్నికల నిర్వహణపై ఫోకస్ 

-ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలోనూ స్పష్టత 

-అనర్హత వేటు కంటే రాజీనామా మేలు అనే భావన 

-ఉపఎన్నికల్లో గెలుపుపై పూర్తిస్థాయిలో ధీమా 

- బెంగాల్‌లో ఎమ్మెల్యే అనర్హత నేపథ్యంలో కీలక నిర్ణయం

హైదరాబాద్, నవంబర్ 15 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నవంబర్ 14 వరకు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే కేంద్రీ కృతమై ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ము గియడంతో ఇతర ఎన్నికల నిర్వహణపై కొం తమేర స్పష్టత వచ్చింది.

తర్వలోనే రాష్ట్రంలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిప ల్ ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తు న్నాయి. జూబ్లీహిల్స్‌లో సాధించిన విజయం తో అధికార కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరి గింది. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నిక లపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అ యితే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు డి సెంబర్‌తో ముగుస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్ని కలను కూడా 2026 ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రా బోయే రోజుల్లో దశలవారీగా ఎన్నికల ప ర్వం కొనసాగనున్నది.

జూబ్లీహిల్స్ గెలుపు తో జోష్‌తో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నిక లను కూడా ముగించాలని యోచిస్తున్నది. అయితే ఈ లోపు ఒక కీలకమైన, వ్యూహా త్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకో నున్నది. ఫిరాయింపుల కేసును కొలిక్కి తీసు కురావాలని ఆలోచిస్తున్నది. జూబ్లీహిల్స్ తరహాలోనే భవిష్యత్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించాలని ప్రణా ళికలు రచిస్తున్నది. అయితే శనివారం ఢిల్లీ లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో  సీఎం బృందం భేటీ కావ డంతో దీనికి మరింత బలం చేకూరు తున్నది. 

ఆ ఇద్దరిపై వేటు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధిం చడంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆ ర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఫిరాయింపుల అంశంపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్‌కు మరింత సానుకూలంగా మారింది.

వాస్తవానికి బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని శాసనసభా స్పీకర్‌కు సుప్రీంకోర్డు సూచించింది. విచారణలో ఇప్పటికే ఆయా ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. ఇంకా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి.. స్పీకర్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది.

స్పీకర్ విచారణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తామింకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని వెల్లడించారు. అయినప్పటికీ పది మంది ఎమ్మెల్యేపై వేటు పడు తుందని బీఆర్‌ఎస్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగి లిన వారికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఎందు కంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు.

ఇదిలాఉండగా బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి 2024 పార్ల మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన ఆయన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా ప్రచా రంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్దరు ఇంకా బీఆర్ ఎస్‌లోనే ఉన్నామని చెప్పేందుకు వీలులేకుండా పోయింది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు అవకాశం ఉందని, ఆ రెండు స్థానా ల్లో ఉప ఎన్నికలు తప్పవని ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కొంత మేర ఆందోళన చెందినప్పటికీ జూబ్లీహి ల్స్ ఉప ఎన్నిక విజయంతో కాంగ్రెస్‌కు బలం చేకూ రింది. ఉప ఎన్నికలను ఎదుర్కోవడంతో ఆత్మవిశ్వా సం రెట్టింపు అయింది.

దీంతో ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటివరకు సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం స్పష్టత వచ్చింది. ఆ ఇద్ద రు ఎమ్మెల్యేపై వేటు పడి, సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించినా ఉప ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. జూబ్లీహిల్స్ ఇచ్చిన ఉత్సాహంతో భవిష్యత్‌లో రాబోయే ఉప ఎన్నికలను సమర్థవం తంగా ఎదుర్కొని విజయ ఢంకా మోగించాలని అధికార కాంగ్రెస్ భావిస్తున్నది. 

కీలకంగా కోల్‌కతా హైకోర్టు తీర్పు... 

పార్టీ ఫిరాయింపుల విషయంలో ఇటీవల కోల్‌క తా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలో బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ముకుల్ రాయ్ ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ముకుల్ రాయ్ పార్టీ ఫిరా యింపులకు పాల్పడ్డారని బీజేపీ నేతలు కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బీజేపీ నేతలు దాఖలుచేసిన అనరత పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ముకుల్ రాయ్‌ను ఎమ్మెల్యే పదవి నుం చి సస్పెండ్ చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2021లో బీజేపీ టికెట్‌పై గెలిచిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడం ద్వారా రాయ్ తన సభ్యత్వాన్ని కోల్పోయారని జస్టిస్ దేబాంగ్షు బసక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వులు జారీచేసింది.

గతంలో రాయ్‌ను అన ర్హులుగా ప్రకటించడానికి లేదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నుంచి తొలగించడానికి నిరాకరించిన స్పీకర్ బిమన్ బెనర్జీ నిర్ణయాన్ని కూడా ధర్మాసనం రద్దు చేసింది. పీఏసీ చైర్మన్‌గా రాయ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే అంబికా రాయ్ 2021లో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం ప్రారంభమైంది. ఈ పదవి సాంప్రదాయకంగా ప్రతిపక్షానికి వెళుతుందని, తృణమూల్‌కు మారిన తర్వాత రాయ్‌ను బీజేపీ ప్రతినిధిగా పరిగణించలే మని ఆయన వాదించారు.

సాంకేతికంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ముకుల్ రాయ్ బహిరం గంగా తృణమూల్‌లో చేరారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. 2023లో సువేందు అధికారి మరొక పిటిషన్ దాఖలు చేస్తూ, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అనేక వాదనల తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలిం చాలని హైకోర్టు స్పీకర్‌ను ఆదేశించింది. ఆ తర్వాత కూడా ముకుల్ రాయ్‌ను అనర్హులుగా ప్రకటించ డానికి ఎటువంటి ఆధారం లేదని స్పీకర్ వాదిం చారు. కానీ ముకుల్ రాయ్ సభ్యత్వాన్ని కోల్‌కతా హైకోర్టు రద్దు చేసింది. 

వేటు కంటే రాజీనామానే మేలు... 

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చింది. మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా అం దులో దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్ర మత్తమైంది. ఒక వైపు ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా, మరోవైపు కోల్‌కతా హైకోర్టు నేప థ్యంలో కీలక నిర్ణయం తీసుకోనున్నది.

వేటు తప్పని పక్షంలో రాజీనా మా చేయించడమే మేలు అని భావిస్తున్నది. దీంతో ఆ ఇద్దరి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నది. ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ విచారణ కొనసాగుతున్నది. ఇప్పటివరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన అందరి విచారణ పూర్తిఅయింది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని ఇటీవల బీఆర్‌ఎస్ కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించాలని అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీర్పు ఆధారంగా రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుందామ ని వేచి చూస్తున్న కాంగ్రెస్ మంచి అవకాశం లభించింది. దీంతో త్వరలోనే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణ యం తీసుకున్నది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సానుకూల పరిస్థితుల్లోనే ఉప ఎన్నిక లను ముగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావి స్తున్నట్టు సమాచారం.