calender_icon.png 16 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీట్ విచారణకు రానా

16-11-2025 12:48:29 AM

బెట్టింగ్ యాప్స్ కేసులో గంటపాటు ప్రశ్నల వర్షం

-బ్యాంక్ స్టేట్‌మెంట్లు సమర్పించిన యాంకర్ విష్ణుప్రియ  

- స్కిల్ గేమ్‌నే ప్రమోట్ చేసా-: రానా

హైదరాబాద్, సిటీ బ్యూరో నవంబర్ 15 (విజయక్రాంతి) : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన కేసు లో సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు లో భాగంగా ప్రముఖ సినీ నటుడు దగ్గు బాటి రానా, యాంకర్ విష్ణుప్రియ శనివా రం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. అధికారులు వీరిద్దరి స్టేట్‌మెంట్లను వేర్వే రుగా రికార్డు చేశారు.

మధ్యాహ్నం సీఐడీ కార్యాలయానికి చేరుకున్న రానాను అధికా రులు సుమారు గంటపాటు విచారించినట్లు సమాచారం. 2017లో ఒక గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న రానాను, యాప్ ల ప్రచారానికి సంబంధించిన ఒ ప్పందాలు, అందుకు ప్రతిఫలంగా తీసుకున్న చెల్లింపులు, ప్రమోషన్ విధానాలపై అధికారులు ప్రశ్నించి నట్లు తెలుస్తోంది. విచారణ తర్వా త బయటికి వచ్చిన రానా.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై స్పందించారు.

ప్రమోట్ చేసింది స్కిల్ బేస్డ్ గేమ్‌ను మాత్రమేనని, దానికి బెట్టింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని.. తా ను ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ చట్టబ ద్ధమైనదని తెలుసుకున్నాకే ప్రచారం చేశా నని మీడియాకు తెలిపారు. ఈ యాప్ ప్రచా రంపై తన న్యాయ బృందం పూర్తిగా విచా రణ చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ  అధికారులకు వివరించినట్లు తెలిపారు. 

మూడు యాప్‌లను..

మరోవైపు, యాంకర్ విష్ణుప్రియ ఏకంగా మూడు వేర్వేరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా ఆమె తన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను కూడా సిట్ అధికారులకు అందజేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయంపై అధికారులు ఆమెను ప్రశ్నించి, స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

రాష్ర్టవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌ల నిర్వాకాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పడింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ముందుకు సాగుతున్న ఈ దర్యాప్తులో టాలీవుడ్‌కు చెందిన మొత్తం 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి వంటి వారిని సిట్ విచారించిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో మరికొంతమందిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.