17-10-2025 12:02:18 AM
ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఈనెల 24న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని చింతల పోచమ్మ ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఎల్లారెడ్డి గౌడ సంఘం కులస్తులు గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి మొదటి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈనెల 24 నుండి 28 వరకు నిర్వహించే విగ్రహ ప్రతిష్టాపనతో పాటు బ్రాహ్మణ పురోహితులతో పూజా కార్యక్రమాలు, ఎల్లమ్మ తల్లి బోనాలు, పోతరాజుల విన్యాసాలు తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
గౌడ సంఘం కులస్తుల ఆహ్వానం మేరకు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, బాలకిషన్ బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, శ్యామ్ గౌడ్, కిషన్ గౌడ్, నారా గౌడ్, సిద్ధా గౌడ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.