17-10-2025 12:01:08 AM
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, అక్టోబర్ 16, (విజయక్రాంతి): యుద్ధ ప్రాతిపదికన రెవిన్యూ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ లొ ఉన్న భూ భారతీయ రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, సీఎం ప్రజావాణి, కలెక్టర్ ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, వివిధ సర్టిఫికెట్ జారీ, ఇసుక, మట్టి అక్రమ రవాణా, ప్రభుత్వ భూముల సర్వే, రేషన్ కార్డుల పంపిణీ తదితర 16 అంశాలు రివ్యూ చేసి వాటి పరిష్కారానికి ఆదేశాలను చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అంశాలు అత్యధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయని జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ , డిఆర్‌ఓ మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎడి సర్వే ల్యాండ్, అన్ని మండలాలతో తాసిల్దార్లు, కలెక్టరేట్ సూపరెంటిండెంట్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.