04-09-2025 12:13:16 AM
ధర్మపురి, సెప్టెంబర్3(విజయక్రాంతి): వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి, కుమ్మరిపల్లి, పాషిగామ,ముత్తునూర్, రాంనూర్ లోని ప్రాథమిక పాఠశాలలో తాత్కాలిక బోధకులు, ఆయాలు గా పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్థులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధకులుగా పనిచేసే వారికి ఇంటర్మీడియట్, ఆయాలుగా పనిచేసేవారికి ఏడవ తరగతి పాసై 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కల్గి ఉండాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్ లకు 5 సంవత్సరాలు, వికలాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంటుందన్నారు. బోధకులకు రూ.8000 ల చొప్పున,ఆయాలకు రూ.6000 చొప్పున నెలసరి గౌరవ వేతనం అందించనున్నట్లు తెలిపారు.ఈ ఎంపీక తాత్కాలికమైనదనీ, వార్షిక సంవత్సరంలో 10నెలలకు మాత్రమే గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు.ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 6వతేదీ సాయంత్రం 5గంటల లోపు మండల విద్యావనరుల కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.