calender_icon.png 11 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశుడిపై వివాదాస్పద పోస్ట్

04-09-2025 12:14:26 AM

రాచకొండ కమిషనరేట్‌పై డీజీపీకి రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3: రాచకొండ కమిషనరేట్ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో వినాయకుడిని అపహాస్యం చేస్తూ పెట్టిన ఓ పోస్ట్ వివాదానికి దారితీసింది. ఆ పోస్ట్ హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉందని పేర్కొంటూ రాష్ట్రీయ వానరసేన అధ్యక్షుడు రామ్‌రెడ్డి నామ్ మంగళవారం తెలంగాణ డీజీపీ జితేందర్‌కు లేఖ రాశారు.

‘మీ తల జాగ్రత్త ! తలపోయినా, నాలాగా అందరికీ కొత్త తల రాదు’ అనే వ్యాఖ్యతో గణేశుడి చిత్రాన్ని పోస్ట్ చేశారని ఆయన తన లేఖలో తెలిపారు. బాధ్యత  గల పోలీస్‌శాఖ నుంచి అలాంటి పోస్ట్ రావడం శోచనీయమని పేర్కొన్నారు. పోస్టు ద్వారా కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలను అవమానించారని తెలిపారు. పోస్ట్ గణేశుడిని ఎగతాళి చేసే విధంగా ఉందని, ఈ చర్యల దైవదూషణ కిందకే వస్తుందని అభిప్రాయపడ్డారు. పవిత్ర దేవుళ్లను అపహాస్యం చేయడం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని, ఆ చర్య భక్తుల్లో అశాంతిని కలిగిస్తుందన్నారు.

పైగా వినాయకుని చవితి ఉత్సవాలు జరుగతున్న సమయంలో అలాంటి ఫ్లెక్సీలు రావడం మరింత బాధాకరమన్నారు. పోస్టు విషయంపై డీజీపీ తక్షణం స్పందించాలని, గణే శుడిపై వివాదాస్పద పోస్టులన్నింటినీ సా మాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే పోస్ట్ చేసినందుకు రాచకొండ కమిషనరేట్ నుంచి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరారు. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి సస్పెండ్ చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు.