calender_icon.png 13 January, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్లకు అండగా కాంగ్రెస్!

13-01-2026 01:02:09 AM

ధాన్యం సేకరణ అవకతవకల కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం?

అధికార పార్టీ అండతోనే తప్పించుకునే ప్రయత్నంలో మిల్లర్లు!

లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు

మంచిర్యాల, జనవరి 12 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో గత ఏడాది రబీ సీజన్ లో కిష్టాపూర్ గ్రామంలో ధాన్యం సేకరణలో జరిగిన అవకతవకలపై అదే గ్రామానికి చెం దిన లంబు శివప్రసాద్ చేసిన ఫిర్యాదు మేర కు విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు విచార ణ చేపట్టి నివేదిక సమర్పించగా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు ఎట్టకేలకు ఏడుగురిపై ఫిర్యాదు చేశారు. జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 53 మందిపై కేసు నమోదు కావాల్సి ఉండగా కొందరిపై కేసు నమోదు కావడంపై శివప్రసాద్ పోలీసుల చుట్టూ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారు ల చుట్టూ తిరుగుతున్నాడు. కాగా సోమవారం జైపూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ నవీన్ కుమార్, ఎస్సు శ్రీధర్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకళతో పాటు కిష్టాపూర్ ఏఈఓ సువర్ణ రేఖ, ఫిర్యాదుదారుడు శివప్రసాద్‌లను విచారించినట్లు సమాచారం.

కేసు తప్పుదోవ?

డబ్బులకు అమ్ముడుపోతున్న అధికారుల తీరు వల్లనే కేసు నీరుగారిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దం దాలో సింహ భాగం మిల్లర్లదే ఉండాల్సి ఉండ గా ఈ కేసులో వారి పేర్లు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం దించుకోకున్నా దిగినట్లుగా ట్రక్ షీట్లు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి ఎలా ఇచ్చారు, ఈ దం దాలో మిల్లర్ల పాత్రపైనా విచారణ జరుపకపోవడం, కేసులో వారి పేర్లు నమోదు చేయక పోవడాన్ని పరిశీలిస్తే కేసును తప్పుదోవ పట్టిం చే ప్రయత్నం జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మిల్లర్లకు అధికార పార్టీ అండ!

జైపూర్ మండలంలోని ఓ మిల్లర్ మంత్రి, ఎమ్మెల్యేలకు, అధికార పార్టీ నాయకులకు దగ్గరగా ఉంటూ ఈ దందాకు అండగా ఉంటు న్నాడని పలువురు మిల్లర్లు చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయ కుడి వెంట ఉంటూ, రైస్‌మిల్ అసోసియేషన్‌లోని కొన్ని తిమింగిళాలతో కలిసి కొత్త దం దాలకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. 

ఏం జరిగినా అధికార పార్టీ నాయకుల అండ ఉంటే చాలు అని, ఏ కేసులై నా మాఫీ అవుతాయనే ధోరణితో వ్యవహరించడమే కాకుండా గతంలో జైపూర్ మండలం ఇందారంలోని ఓ మిల్లు యజమాని రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన పదవిని ఆశిస్తున్నాడనే అక్కసుతో కేసులో ఇరికించారని, దీనిలో ప్రధాన పాత్ర ఓ ఐదుగురి పాత్ర ఉందని మిల్లర్లు నేరుగా చర్చించుకుంటున్నారు. దొంగ ట్రక్ షీట్ల ద్వారా లక్షలు దండుకున్న మిల్లర్లు రేషన్ బియ్యం కొని సీఎంఆర్ పెట్టారని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో సివిల్ సప్లయ్ అధికారులకు తెలుసునని, అధికారుల అండతోనే ఇదంతా జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లక్షలు చేతులు మారాయి?

రైస్ మిల్లర్ల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు లక్షల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. మిల్లు ట్యాగింగ్, అలాట్ మెంటు, బెడ్‌ల కేటాయింపు ఇలా ప్రతిదానిని కొనే రైస్ మిల్ అసోసియేషన్ లోని ‘ప్రధాన’ వ్యక్తులకు కేసుల నుంచి తప్పించుకోవడం వారికి లెక్కేకాదు అనడానికి కిష్టాపూర్ కేసు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పండని, మిల్లుకు పోని ధాన్యానికి సీఎంఆర్ ఎలా ఇచ్చారు, ఎక్కడ కొని ఇచ్చారో అధికారులకు తెలియదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.