calender_icon.png 13 January, 2026 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత వివేకానందని ఆదర్శంగా తీసుకోవాలి

13-01-2026 01:03:40 AM

ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జనవరి౧౨ (విజయక్రాంతి): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని, వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావు ల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, డా. మల్లికార్జున్ రెడ్డి, ముత్యం రెడ్డి, అచ్యుత్ రావ్, పట్టణ అధ్యక్షులు కార్తీక్, సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు భూపతి రెడ్డి, ఏడిపెల్లి నరేందర్, పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.