calender_icon.png 3 May, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అవకతవకలు

03-05-2025 12:30:22 AM

అశ్వాపురం  మండల బిఆర్‌ఎస్ పార్టీ  అధ్యక్షుడు అమరేందర్ యాదవ్

అశ్వాపురం మే 2(విజయ క్రాంతి) : అర్హులైన నిరుపేదలకే ఇండ్లు ఇవ్వాలని కోడి అమరేందర్ డిమాండ్ చేశారు. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో  శుక్రవారం పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ ఇల్లు జాబితాలో అసలైన లబ్ధిదారులు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇంది రమ్మ ఇల్లులు ఇవ్వడం చాలా సిగ్గు చేటు అనీ,గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో గ్రామసభల ద్వారా అన్ని గ్రామాల్లో ఎంపిక చేసిన నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజాపాలనలో అందరి పేర్లు  చదివి,పేదవాళ్లకు కాకుండా తమ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. అదేవిధంగా అధికారులు,సెక్రెటరీ లు గుట్టుసప్పుడు కాకుండా సర్వే నిర్వహించి పెత్తనం చేస్తున్నార న్నారు.

ఈ విషయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  దృష్టిలో పెట్టుకొని ప్రజా పాలన లో గ్రామ సభలో ఎవరి పేర్లు ఐతే చదివిరో ఆ నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని ,లేని పక్షంలో గత గ్రామ సభల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారుల తో మండల కేంద్రంలోనీ ఎంపీడీవో  కార్యాలయం నందు  అన్ని  గ్రామ పంచాయతీ ల దగ్గర పెద్ద ఎత్తున కలిసి వచ్చే ప క్షాలతో ధర్నా ని నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వాన్నీ, అధికార పార్టీ నాయకులను  హెచ్చరించారు.