03-05-2025 12:30:24 AM
గ్రామస్తులు ఐకమత్యంగా ఉండాలి: ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
రాజేంద్రనగర్, మే 2 : శంషాబాద్ మండలంలోని రామాంజపూర్ నుంచి వేరుపడి బోటిగూడ ప్రతేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన నేపథ్యంలో నూతన పంచాయతీగా విధులు నిర్వహించనుంది.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. పంచాయతీ భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగాబోటిగూడ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల తమ కల నెరవీరిందని, తమ బాధలు తప్పుతాయన్ని పేర్కొన్నారు.
అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు పింఛన్ డబ్బులకు, రేషన్ బియ్యనికి రామాంజపూర్ వెళ్లే అవస్థలు తప్పుతాయన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి ఆయనను సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్తులు పట్టుబట్టి బోటిగూడను ప్రత్యేక గ్రామ పంచాయతి గా ఏర్పాటు చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు.
అందరూ ఐక్యతగా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గం ఎన్నుకోవాలని సూచించారు. చిన్న గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిద్దికోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ రవి గౌడ్, వైస్ చైర్మన్ ప్రభు సాగర్, మాజీ జడ్పీటీసీ తన్వి రాజ్, ఎంపీడీఓ మున్నీ, ఎంపీఓ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.