ఏసీబీ వలలో ఇరిగేషన్ డీఈ

27-04-2024 02:27:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఇంజినీర్ పవన్‌కుమార్ 4లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉప్పల్ భగయత్‌లో ఓ వాణిజ్య సముదాయ నిర్మాణం కోసం ఎన్‌ఓసీ జారీ చేసేందుకు ఓ బిల్డర్ నుంచి డీఈ పవన్‌కుమార్ రూ. 5లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గోపాగాని రమణమూర్తి ఏసీబీ అధికారు లను ఆశ్రయించగా ప్రణాళిక ప్రకారం దాడిచేసి సికింద్రాబాద్ బుద్ధభవన్‌లో రూ. 4లక్షల లంచం తీసు కుంటుం డగా డీఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు నిందితుడు పవన్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్  చేశా రు. డబ్బు స్వాధీనం చేసుకొని, నాంప ల్లి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.