01-05-2025 01:48:41 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కేసీఆర్ మాటల్లో, కళ్లల్లో విషం కని పిస్తోందని, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రె స్ పార్టీ విలన్ అయ్యిందా? అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు. బుధవారం రవీంద్రభారతిలో నిర్వ హించిన మహత్మా బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బసవేశ్వరుడు అని కొనియాడారు. స మాజంలో అనేక మార్పులకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడు అని, ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. బసవేశ్వర జయం తి రోజున పదో తరగతి ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.
పాలకపక్షం లోపాలు ఎత్తిచూపాలి..
ప్రతీ మనిషి గౌరవంగా బతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని, పాలకపక్షం తీసుకునే నిర్ణయాల్లో లోపాల ను ఎత్తి చూపేందుకే ప్రతిపక్షం ఉందని సీ ఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కొందరు రజతోత్సవాలు, విజయోత్సవాలు ఏర్పాటు చేసుకుంటే ఆర్టీసీ నుంచి బస్సులు ఇచ్చేలా ప్రభుత్వం సహకరించిందని, అయినా ఆయ న సభలో కాంగ్రెస్‌ను విమర్శించారని ఎద్దే వా చేశారు.
వరంగల్ సభలో మేం చేసిన మంచిని అభినందించి, ప్రజా సమస్యలను ప్రస్తావించి ఉంటే నిజంగానే ప్రజలు ఆయనను అభినందించే వాళ్లు అని హితవు పలికారు. ఇన్నాళ్లు ఆయన ఇంట్లో నుంచి కా లు కదపకుండా ప్రతిపక్ష నాయకుడిగా రూ. 65 లక్షలు, వాహనాలు, పోలీస్ భద్రత తీసుకున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పనిచేయకుండా ఫాంహౌజ్‌లో పడుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు.
రైతుబంధు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీవంటి పథకాల్లో ఏది ఆగిపోయిందో చెప్పాలని ప్రశ్నించారు. మ హిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వంటి వి కనిపించడం లేదా అని మండిపడ్డారు.
రెచ్చగొట్టాలని చూస్తున్నారు..
ఏ మత్తులో తూగుతున్నారో వారికే తెలియాలని, కడుపు నిండా విషం పెట్టుకుని విద్వేష పూరిత ప్రసంగం చేసి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు విజ్ఞులని, ఎవరేం చేశారో వారికి తెలుసని స్పష్టం చేశారు. పదేళ్లపాటు ప్రజలు మెచ్చే పరిపాలన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉచితబస్సు, రుణమాఫీ, రైతు బంధు, 60 వేల ఉద్యోగాల కల్పన, ఎ స్సీ వర్గీకరణ, కులగణనపై చర్చకు సిద్ధమా? అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. వం ద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టు కేసీఆర్ వరంగల్‌కు వెళ్లి పాపాలు కడిగేసుకోవాలనుకున్నారని, కానీ అక్కడికి వెళ్లి అబ ద్ధాలు మాట్లాడి ఇంకో తప్పు చేశారని విమర్శించారు.
వరంగల్ సభలో తన పేరు కూ డా పలకలేకపోయారని ఎద్దేవా చేశారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో రాష్ట్ర ఆదాయం పెంచి, పేదలకు పంచాలనే విధానంతో తమ ప్రభు త్వం ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశా రు. ప్రజలకు మేలు చేయడమే తమ పని అని, ప్రజలే తమ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లని స్పష్టం చేశారు.