8 April, 2026 | 2:28 AM

బకాయిలే కారణమా!

08-04-2026 12:49 AM

కరీంనగర్/సిరిసిల్ల, ఏప్రిల్7(విజయక్రాంతి): సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లైసెన్స్ రినివల్ చేయకుండా ఎన్ పి డి సి ఎల్ అప్పగించడం వెనుక బకాయిలే కారణంగా తెలుస్తుంది. సెస్ సంస్థలో వ్యాపార నిర్వహణ సరిగా లేదని బిల్లుల చెల్లింపు బకాయిలను సూచిస్తూ 2024-25లో ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలని ప్రభుత్వానికి ఈఆర్సీ సిఫార్సు చేసింది.

లెక్కలు ఎలా ఉన్నా సిరిసిల్ల సెస్ వినియోగదారులు ఎన్పీడీసీఎల్లో విలీనాన్ని వ్యతిరేకి స్తూ వస్తున్నారు. తాజాగా సెస్ పరిధిలో విద్యుత్ సరాఫరాను ఎన్పీడీసీల్కు అప్పగించడంతో లాభాల బాటలో పయనిస్తున్న సె స్ను కాపాడుకోవడానికి ఉద్యమాలకు సిద్దం అవుతున్నారు.

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సం ఘానికి బకాయిలు పేరుకు పోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కోట్లలో ఉన్నాయి. ప్రభుత్వం, ఇతర విభాగాల నుంచి సిరిసిల్ల సెస్కు రావాల్సిన బకాయిలు రూ.871.05 కోట్లు . ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు రాక, విద్యుత్ బిల్లుల చెల్లింపులు జరగలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1970లో 420 సర్వీసులతో ప్రారంభమైన సహకార విద్యుత్ సరఫరా సంఘంలో ప్రస్తుతం 3 లక్షల 51వేల 772 మంది సభ్యులు ఉన్నారు. వీరి వాటాధనం రూ6.32 కోట్లు ఉండగా, సెస్ ఆస్తులు రూ .252.29 కోట్లకు చేరుకున్నాయి.

గృహ కనెక్షన్లు 1,71,510, వాణిజ్య కనెక్షన్లు 21,486 కనెక్షన్లు, పరిశ్రమల కనెక్షన్లు 1,528, పవ ర్లూం కనెక్షన్లు 5,635, వ్యవసాయ కనెక్షన్లు 78,611, గ్రామ పంచాయతీ వాటర్ కనెక్షన్లు, విద్యుత్ దీపాల కనెక్షన్లు 3,118 ఉన్నాయి. సెస్కు ప్రభుత్వం, వినియోగదారులు, వివిధ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోయాయి . ప్రస్తుతం సెస్కు రూ.871.05 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.

ఇందులో ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దాదాపు రూ.700 కోట్ల బకాయిలు రా వాల్సి ఉంది. ఇందులో సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు 50 శాతం సబ్సిడీ బకాయిలు రూ.57.46 కోట్లు, దీనికి సర్చార్జిగా రూ. 1.33 కోట్లతో కలిపి రూ.58.79 కోట్లు ప్రభు త్వం నుంచి రావాల్సి ఉంది. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా, వీటికి సం బంధించిన నీటిసరఫరా, వీధి దీపాలకు సం బంధించి రూ.319.52 కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. వ్యవసాయ విద్యుత్ స బ్సిడీకి సంబంధించి రూ.220.11కోట్ల బకాయిలు ఉన్నాయి. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి బిల్లులు రూ.20.27 కోట్ల బకాయిలు ఉ న్నాయి.

ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాలు, 1,049 ఉండగా, వీటికి సంబంధించి రూ. 3.53కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. జిల్లాలో సెస్ వినియోగదారుల నుంచి వి విధ కనెక్షన్లకు సంబంధించి రూ.199.15 కో ట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్న వ్యవసాయదారుల నుంచి సర్వీస్ రుసుము కింద బకాయిలు రూ.16.13 కోట్లు రావాల్సి ఉన్నాయి.

గృహాలకు సంబంధించి రూ. 40.40కోట్లు, కమర్షియల్కు సంబంధించి రూ.25.43 కోట్లు, పరిశ్రమలకు సంబంధించి రూ.47.86 కోట్లు, మరమగ్గాల పరిశ్రమ నుంచి రూ4.29 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నాయి. సెస్ కంటే మెరుగయిన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్ పి డి సి ఎల్ బకాయిల విషయంలో ఏమి చెస్తుందో చూడాలి.